![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -473 లో.....శౌర్య స్కూల్ కి వెళ్ళనని మారాం చేస్తుంది. ఎందుకు వెళ్లవని కార్తీక్ అడుగుతాడు. నేను చదవట్లేదు. నాకు మీరు వచ్చాక చదువు చెప్పట్లేదని కార్తీక్, దీపలతో శౌర్య అంటుంది. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి.. నిన్న జరిగిన దానికి మీరు ఇక పనికి రారు కదా.. ఇక అగ్రిమెంట్ ప్రకారం పది కోట్లు ఇవ్వాలి రెడీ చేసుకోమని అంటుంది.
దానికి సమాధానంగా.. "మనం ఏదో జరిగిందానికి వెళ్లకుండా ఉంటే మూర్కులు గెలిచారని ఫీల్ అవుతారు" అంటూ శౌర్యాతో కార్తీక్ అంటే అదంతా ఫోన్ లో లైన్ లో ఉన్న జ్యోత్స్న వింటుంది. బావ ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నాడని అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. శివన్నారాయణ ఎదురు వచ్చి వద్దని చెప్తాడు. ఇక మీరు పని మానెయ్యండి అని చెప్తాడు. మేం వస్తామని కార్తీక్, దీప రిక్వెస్ట్ చేస్తారు. దాంతో శివన్నారాయణ లోపలికి వెళ్తాడు. అసలు ఈ గొడవ అంత మీ వల్లే.. నిన్న సుమిత్ర, దశరథ్ గొడవ పడ్డారు. దాంతో దశరత్ ని జ్యోత్స్న ఏదో మాట అందని జ్యోత్స్నని సుమిత్ర కొట్టిందని కార్తీక్, దీపలతో పారిజాతం అంటుంది.
మరొకవైపు దశరథ్ కి కాఫీ తీసుకొని వెళ్తుంది దీప. నా వల్ల మీరు, అమ్మ ఎందుకు గొడవ పడుతున్నారని దీప అంటుంది. నా భార్య మొదట్లో ఎలా ఉందేదో అలా మార్చుకోవాలనుకుంటున్న ప్లీజ్ దీప.. ఇంకొకసారి ఈ విషయం గురించి మాట్లాడకని దశరథ్ అంటాడు. అదంతా సుమిత్ర వింటుంది. జ్యోత్స్న వచ్చి ఆ దీప ని తిట్టు మమ్మీ అని అంటుంది. ఎందుకు తిట్టాలి తను అన్నదాంట్లో తప్పేముందని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |